రోజుకో గుడ్డు ఎందుకు తినాలి?

ఉడకబెట్టిన గుడ్డు రోజుకొకటి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ స్థాయులు అధికంగా ఉంటాయని, చాలా మంది వీటిని తినరు.

నిజానికి రోజుకో ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

శరీరంలో పలు జీవక్రియలకు ఇందులోని పోషకాలు అవసరం. కణాల పనితీరు, ఎదుగుదలకు, శక్తికి ఆ పోషకాలు కావాలి.

పచ్చసొనలో ఉండేది మంచి కొలెస్ట్రాల్. కాబట్టి రోజుకో గుడ్డు తినడం వల్ల గుండెకు మంచిది.

పచ్చసొనలో ఇనుము, ల్యూటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కంటిజబ్బులు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రోజుకో గుడ్డు తినేవారిలో పక్షవాతం వచ్చే ముప్పు 12 శాతం దాకా తగ్గిపోతుంది.