హెడ్ ఫోన్స్ అధికంగా వాడితే మెదడుకు ముప్పే

ఖాళీగా ఉన్నా, ప్రయాణాలు చేస్తున్నా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం హెడ్‌ఫోన్స్ అధికంగా వాడడం వల్ల, శారీరకంగా హాని కలగడమే కాదు, వాటికి బానిసలుగా కూడా మారిపోతారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం సుమారు 100 మంది యువత కేవలం ఈ ఇయర్ ఫోన్స్ కారణంగా వినికిడి లోపం వచ్చే ప్రమాదం అంచున ఉన్నారు.

ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడే వారిలో కొన్నాళ్లకు వినికిడి సామర్థ్యం తగ్గుతుంది.

హెడ్ ఫోన్స్ అధికంగా వాడడం వల్ల హృదయ స్పందన వేగం పెరుగుతుంది. దీంతో దీర్ఘకాలికంగా గుండెకు నష్టం కలగక తప్పదు.

హెడ్ ఫోన్లో నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు, మెదడుపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.

ఎక్కువ కాలం పాటు ఇయర్ ఫోన్లో సంగీతం వినే వాళ్ళలో నిద్రలేమి, స్లీప్ ఆప్నియా వంటి నిద్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇయర్ బడ్‌లు చెవి లోపలకి పెట్టుకోవడం వల్ల ఇవి అడ్డంకిగా ఉంటాయి. ఈ అడ్డంకుల వల్ల చెవిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది.