పాలతో చేసిన కాఫీ వల్ల అనేక ప్రయోజనాలు అందిస్తుందని ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది. పాలలో అమైనో ఆమ్లాలు, కాఫీలో ఉండే పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కీళ్లలో వాపు, నొప్పి తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ లేదా ఇతర గాయాల కారణంగా శరీరంలో వాపు, నొప్పి సమస్యలు వస్తాయి. వాటిని మిల్క్ కాఫీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పాలు ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు కలిగి ఉంటాయి. ఎముకలకు చాలా ఆరోగ్యకరమైనవి. పాల కాఫీ వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. జీవక్రియని పెంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పరిశోధన వెల్లడించింది. మధుమేహాన్ని కూడా నియంత్రించగలదు. పాలతో చేసిన కాఫీలో 60 కేలరీలు ఉంటాయి. అందుకే బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్ళు పాలతో చేసిన కాఫీ నివారించాలి. పాల కాఫీ ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అసలు తీసుకోకూడదు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు బ్లాక్ కాఫీ ఉత్తమ ఎంపిక.