అరటిపండు తింటే కండరాలకు విశ్రాంతినిస్తుంది. రక్తపోటుని నియంత్రిస్తుంది. నిద్రబాగా పట్టేందుకు సహకరిస్తుంది.

చెర్రీస్ నిద్రనాణ్యతను మెరుగుపరుస్తాయి. మెగ్నీషియం, పొటాషియం, మెలటోనిన్ సమృద్ధిగా ఉంటుంది.

నిద్రరుగ్మతలు నయం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు సేరోటోనిన్ ఉన్నాయి.

జెట్ లాగ్, నిద్రలేమిని అధిగమించేందుకు పైనాపిల్ అధ్భుతమైన పండు. మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది.

నారింజలు తినడం వల్ల శరీరంలో మెలటోనిన్ స్థాయిలు 47 శాతం వరకు పెరుగుతాయి. నిద్ర హాయిగా పడుతుంది.

టొమాటోలో లైకోపీన్ అనే ఫైటో న్యూట్రియెంట్ ఉంటుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది

అవకాడోలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. నిద్ర వచ్చేలా చేయడంలో సహకరిస్తుంది.

పని ఒత్తిళ్లు, ఎక్కువ స్క్రీన్ టైమ్ కారణంగా కొందరికి నిద్రలేమి సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది.

ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఈ పండ్లు చక్కగా ఉపయోగపడతాయి.

అందుకే ప్రతిరోజు నిద్రపోయే ముందు ఈ పండ్లు తిని చూడండి మంచి ఫలితాలు పొందుతారు.
Image Credit: Pexels