పచ్చి బంగాళాదుంపలు తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. లిమా బీన్స్ లో లైనమారిన్ అనే సమ్మేళనం ఉంటుంది. పచ్చివి తింటే ఇది సైనెడ్ గా మారుతుంది. కిడ్నీ బీన్స్ నాలుగైదు పచ్చివి తిన్నా చాలు జీర్ణశయాంతర సమస్యలు వచ్చేస్తాయి. వీటిలో లెక్టిన్లు ఉంటాయి. అడవి పుట్టగొడుగులు ఉడికించకుండా తినకూడదు. గొడ్డు మాంసం ఎప్పుడు వండిన తర్వాతే తినాలి. ఇందులోని కొన్ని బ్యాక్టీరియా వల్ల పుడ్ పాయిజనింగ్ అవుతుంది. వంకాయలో సోలనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. పచ్చిగా తింటే వికారం, వాంతులు, మైకం వస్తాయి. ఈ విషం నరాల పనితీరుని దెబ్బతీస్తుంది. పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది హానికరమైనది. మొలకెత్తించిన గింజలు చాలా ఆరోగ్యం కానీ అవి పెరగకముందే విత్తనాల్లోకి వచ్చే వ్యాధికారక బ్యాక్టీరియా హాని చేస్తుంది. చేదు బాదంలో సైనేడ్ ఉంటుంది అసలు తినకూడదని పదార్థం. తేనె ఆరోగ్యానికి మంచిదే కానీ పచ్చి తేనె తీసుకుంటే హాని చేస్తుంది. పిల్లలు, గర్భిణీ స్త్రీలు అసలు తీసుకోకూడదు.