గుండె కోసం నల్ల అన్నం తెల్లబియ్యం, దంపుడు బియ్యాన్నేఅధికంగా తింటారు ఎక్కువ మంది. మధుమేహులకు, గుండె సమస్యలు ఉన్నవారికి దంపుడు బియ్యం మాత్రమే కాదు నల్ల బియ్యం కూడా మేలు చేస్తాయి. బ్లాక్ రైస్‌ని ‘ఫర్‌బిడెన్ రైస్’ అని పిలుస్తారు. వీటిలో ఖనిజాలు, ప్రొటీన్, ఫైబర్, ఇనుము అధికంగా ఉంటాయి. ఆంథోసియానిన్ అనే పిగ్మెంట్ వల్ల బియ్యానికి నలుపు రంగు వస్తాయి. దీనిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు అధికం. ఈ బియ్యంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఈ బియ్యంలో ల్యూటీన్, జియాక్సింతన్ ఉంటాయి. ఇవి కంటి చూపును కాపాడతాయి. నల్ల బియ్యంలో గ్లూటెన్ ఉండదు. సెలియాక్ వ్యాధి ఉన్న వారు వీటిని తినవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారు వీటిని మెనూలో చేర్చుకోవాలి.