అవును మీరు విన్నది నిజమే పిజ్జా టిని కూడా బరువు తగ్గొచ్చు. కానీ ఇలా తింటేనే మీరు బరువు అదుపులో ఉంచుకోగలుగుతారు.

పిజ్జా తయారీకి మైదా పిండికి బదులుగా గోధుమ పిండి ఉపయోగించాలి. ఇందులో ఫైబర్, పోషకాలు ఉన్నాయి.

పిజ్జా మీద బెల్ పెప్పర్స్, పుట్ట గొడుగులు, ఉల్లిపాయలు, బచ్చలికూర, టొమాటోలు వంటి కూరగాయలు జోడించుకోవచ్చు.

ఇవన్నీ బరువు తగ్గించేందుకు దోహదపడే ఆహార పదార్థాలు. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూనే కేలరీల సంఖ్య తక్కువగా ఉంచుతుంది.

పిజ్జా మొత్తం ముందు పెట్టుకుని తినేయకుండా ఫ్రెండ్స్ లేదా ఇతరులతో దాన్ని పంచుకుని తినాలి.

పిజ్జాను మితంగా తినాలి. ఇది ప్రధానమైన ఆహారంలో భాగం ఎంత మాత్రం కాదు అనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

పిజ్జాలో అతిగా చీజ్ వేసుకుని లాగించేయకూడదు. దాన్ని అతిగా తింటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

బరువు తగ్గాలని ప్లాన్ వేసుకున్నపుడు ఇష్టమైన ఆహారాలను కూడా వదిలేసుకుంటారు. అలా చేస్తే వాటిని తినాలనే ఇష్టం ఎక్కువగా ఉంటుంది.

అందుకే నచ్చిన పదార్థాలు మితంగా తీసుకుంటూ కూడా బరువుని అదుపులో ఉంచుకోవచ్చు.
Image Credit: Pexels