అల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి ఇస్తుంది.

కొద్దిగా అల్లం, నిమ్మరసం, తేనె, మిరియాలు వంటి పదార్థాలతో తయారుచేయబడే పానీయమే అల్లం షాట్.

అల్లం షాట్ రెండు లేదా మూడు సిప్స్ చేసినా చాలు మీ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు.

అల్లం షాట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వికారం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అల్లంలో జింజేరోల్, షోగోల్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

అల్లం సప్లిమెంట్లు తీసుకున్న వారిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 28 శాతం తగ్గాయని ఒక అధ్యయనం వెల్లడించింది.

అల్లం షాట్ రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. మెదడు పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అల్లం షాట్ ఆరోగ్యమే కానీ పిత్తాశయంలో రాళ్ళు, రక్తస్రావం రుగ్మతలు, లోబీపీ ఉన్న వాళ్ళు తీసుకోకపోవడమే ఉత్తమం.

అల్లం షాట్ ఘాటుగా ఉంటుంది. అందుకే చాలా కొద్దిగా తీసుకోవాలి.
Image Credit: Pexels