మనం రోజూ ఎంతో ఇష్టంగా తినే బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ వెనుక ఎంత కథ ఉందో మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి

కర్ణాటకకి చెందిన ప్రముఖ ఆహార శాస్త్రవేత్త కేటీ ఆచార్య చెప్పిన దాని ప్రకారం ఇడ్లీని 7 నుంచి 12వ శతాబ్దంలో ఇండోనేషియాలో గుర్తించారు.

అక్కడ దీన్ని 'కెడ్లీ' లేదా 'కేదారి' అని పిలుస్తారు. ఇండోనేషియా వంటకం కెడ్లీ కాస్తా భారత్ కి వచ్చి ఇడ్లీగా మారింది.

అరబ్బులు ఇడ్లీ తీసుకొచ్చారని ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ హిస్టరీ' అనే పుస్తకంలో, 'సీడ్ టు సివిలైజేషన్ ది స్టోరీ ఆఫ్ ఫుడ్' అనే పుస్తకంలోఉంది.

అరబ్బులు హలాల్ ఆహారాలు, రైస్ బాల్స్ మాత్రమే తినేవారు. ఈ రైస్ బాల్స్ కొద్దిగా ఫ్లాట్ ఆకారంలోకి మారి ఇడ్లీగా మారాయని చెబుతారు.

ఇడ్లీలు భారతీయ వంటకాల్లో భాగమని అనేక ఆధారాలు ఉన్నాయి. 7వ శతాబ్దంలోని కన్నడ పుస్తకం 'వద్దరాధనే' అనే పుస్తకంలో ఇడ్లీ గురించి రాశారు.

10వ శతాబ్దంలో వచ్చిన తమిళ పుస్తకం 'పెరియ' పురాణంలోనూ ఈ వంటకం గురించి ప్రస్తావించారు.

భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్షంలో వ్యోమగాములతో పాటు అంతరిక్షంలోకి వెళ్ళిన పదార్థం ఏంటో తెలుసా?
సాంబార్ పౌడర్, చట్నీ పౌడర్ తో పాటు ఇడ్లీని కూడా తీసుకెళ్లారు.


Images Credit: Pixabay/ Pexels/ Unsplash