పంచదార ఆరోగ్యానికి మంచిది కాదు కానీ దాన్ని ఒక్కసారిగా తినడం మానేస్తే మాత్రం తీవ్ర దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

షుగర్ మానేస్తే డిప్రెషన్ కి గురవుతారు. మెదడు పని చేయడంలో కీలక పాత్ర పోషించే న్యూరోట్రాన్స్మిటర్ విడుదల తగ్గుతుంది.

ఏకాగ్రత లోపిస్తుంది. రోజువారీ కార్యకలాపాలపై దృష్టి పెట్టలేరు.

చక్కెర తీసుకోవడం ఒక్కసారిగా మానడం వల్ల ఆందోళన పెరిగిపోతుంది.

వికారం, వాంతులు వంటి జీర్ణ సమస్యల్ని ఎదుర్కొంటారు.

చక్కెర తీసుకోకపోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాల్లో ఒకటి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి తలనొప్పి రావడం.

చిన్న చిన్న వాటికే చిరాకు పడతారు. మనసు చికాకుగా ఉంటుంది.

చక్కెర వదిలేయడం వల్ల కార్బ్ లోడ్ ఆహారాన్ని ఎక్కువగా కోరుకుంటారు. స్వీట్స్ ఎక్కువగా తినాలని అనిపిస్తుంది.

చక్కెర వదిలేయడం వల్ల నిద్రలేమి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.