కొన్ని రకాల ఆహారాలు ఆరోగ్యాన్ని ఇస్తాయని తినేస్తారు. కానీ వాటి వల్ల ఆరోగ్యం మాట ఏమో కానీ అనారోగ్యాల పాలవుతారు.

అందుకే ఈ ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకునే అలవాటు ఉంటే వెంటనే వదిలేయడం మంచిది

పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఎక్కువగా తింటారు. కానీ దాన్ని గింజలతో చేయరు.. కేవలం గార్నిషింగ్ గా చల్లుతారు.

బాటిల్ లేదా ప్యాక్ చేసిన పండ్ల రసాలు చక్కెరతో లోడ్ చేయబడి ఉంటాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి

తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవే కానీ అవి చక్కెర, ఉప్పుతో నిండి ఉంటాయి

ప్యాకెట్స్ లో ఉండే డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా రసాయనాలు, చక్కెర ఉంటాయి. ఫ్రీజ్ చేసి తయారు చేసే క్యాన్డ్ డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు ఉండవు

సోయా సేంద్రీయంగా లేనప్పుడు ఈస్ట్రోజెన్ పెంచుతుంది. ఇది బరువు పెరగడానికి కారణంఅవుతుంది. సోయా పాలు, పెరుగులో చక్కెర ఎక్కువగా ఉంటుంది.

స్పోర్ట్స్ డ్రింక్స్ లు చక్కెర సిరప్ తప్ప ఏమి ఉండవు. వీటిని నిరోధించడమే ఉత్తమం

ఒక గ్లాసు స్మూతీలో నాలుగు లేదా ఐదు సెర్విన్గస్ పండ్లతో సమానమైన గ్లైసిమిక్ ఉంటుంది. అందుకే తాజా పండ్లు తీసుకోవడం మంచిది

గ్లూటెన్ రహిత స్నాక్స్ లో ఉప్పు, కేలరీలు ఎక్కువ. అందులో ప్రోటీన్, ఫైబర్ ఉండవు, చక్కెర మాత్రం ఉంటుంది

క్యాన్డ్ సూప్స్ లో అధిక సోడియం, చక్కెర ఉంటాయి. వీటి వల్ల ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది