బ్రౌన్ రైస్‌తో టేస్టీ దోశె

బ్రౌన్ రైస్ - రెండు కప్పులు
అటుకులు - పావు కప్పు
శెనగపప్పు - రెండు స్పూన్లు
మినప్పప్పు - అర కప్పు
మెంతులు - అర స్పూను
ఉప్పు - రుచికి

బ్రౌన్ రైస్‌ను నాలుగ్గంటలు నానబెట్టాలి. వేరే గిన్నెలో మినప్పప్పు, శెనగపప్పు, మెంతులు వేసి నానబెట్టాలి.

బ్రౌన్ రైస్‌, మినప్పప్పు, శెనగపప్పు, మెంతులు వేసి మిక్సీలో రుబ్బుకోవాలి.

పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో ఉప్పు వేసి కలపాలి.

గిన్నెపై మూత పెట్టి ఎనిమిది గంటలు బయటే వదిలేయాలి. ఆ పిండి పులుస్తుంది.

మరుసటి రోజు ఉదయం ఈ పిండిని కలుపుకొని, అవసరం అయితే నీళ్లు వేసుకోవాలి.

స్టవ్ పై పెనం పెట్టి నూనె వేసి, వేడెక్కాక దోశెలు పోసుకోవాలి.

వీటిని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.