పాదాలకు పగుళ్లు ఎందుకు వస్తాయి?

పాదాల అడుగున వెనుక భాగంలో చర్మం గరుకుగా మారి తర్వాత పగుళ్లుగా ఏర్పడుతుంది.

పగుళ్లు చూడటానికి అందవికారంగా కనిపించడమే కాదు కొన్నిసార్లు మంట, నొప్పితో బాధిస్తుంది.

శరీర భారాన్ని మొత్తం పాదాలే మోస్తాయి. దీనివల్ల అవి ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. అందుకే పాదాల కింద చర్మం చాలా మందంగా ఉంటుంది.

శరీర రక్తప్రసరణ వ్యవస్థలో అడుగున ఉండేవి పాదాలే. అందుకే అక్కడి వరకు రక్తం చేరడం ఒక్కోసారి తగ్గిపోతుంది.

పాదాల అడుగు భాగానికి రక్త ప్రసరణ సరిగా చేరక అక్కడ ఎండిపోతుంది, దీనివల్ల చర్మం పగుళ్లు ఏర్పడుతుంది.

పాదాలకు కొబ్బరి నూనె పట్టించి, మర్ధనా చేస్తే పగుళ్లు రావడం తగ్గుతుంది.

మర్ధనా చేయడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

రోజులో పావుగంటసేపు పాదాలను చల్లని నీరు నింపిన బకెట్లో ముంచి రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు పోతాయి.