టేస్టీ గుత్తి కాకరకాయ వేపుడు

కాకరకాయలు - పావుకిలో
నూనె - తగినంత
ధనియాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను

ఎండు కొబ్బరి - చిన్న ముక్క
కారం - ఒకటిన్నర స్పూను
పసుపు - పావు స్పూను
వెల్లుల్లి రెబ్బలు - పది
ఉప్పు - రుచికి సరిపడా

కాకర కాయలను నిలువుగా కోసుకుని గుత్తి వంకాయలు గాటు పెట్టినట్టే మధ్యలో గాటు పెట్టి, లోపలున్న గింజలన్నీ తీసివేయాలి.

కాకరకాయల పొట్టలో ఉప్పును రుద్ది అలా పదినిమిషాలు ఉంచాలి. తరువాత కాయలను చేతితో పిండితే నీళ్లు, చేదు బయటికి పోతుంది.

ఇప్పుడు కళాయిలో నూనె వేసి అందులో కాకరకాయలను వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీలో ధనియాలు, కారం, ఎండుకొబ్బరి, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బుకోవాలి. నీళ్లు వేయాల్సిన అవసరం లేదు.

స్టవ్ పై కళాయి పెట్టి రెండు చెంచాల నూనె వేసి, స్టఫ్ చేసిన కాకర కాయలను వేయించాలి. చిన్న మంట మీద వేయిస్తే చక్కగా వేగుతాయి.