నిమ్మకాయ, తేనె, దాల్చిన చెక్క గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే కొవ్వుని కరిగించేస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.

జీలకర నీళ్ళు శరీరంలో జీవక్రియను వేగవంతం చేస్తాయి. కొవ్వుని కరిగించేస్తాయి.

ఉసిరి రసంలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. శరీరం నుంచి విషాన్ని బయటకి పంపుతుంది.

కలబంద జ్యూస్ జీర్ణశక్తిని పెంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

అల్లం నీళ్ళు తాగితే జీర్ణవ్యవస్థ బాగుంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

గ్రీన్ టీ పొట్ట దగ్గర కొవ్వుని కరిగించేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

మెంతులు నీళ్ళు తాగితే పొత్తికడుపులో కొవ్వుని కరిగించేస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.

గోరువెచ్చని నీళ్ళు శరీరంలోని కొవ్వుని విచ్చిన్నం చేయడానికి, ఆకలిని అరికట్టడానికి సహాయపడుతుంది.

వీటిని తీసుకోవడం వల్ల నాజూకుగా మారవచ్చు.
Images Credit: Pexels