కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెని కాపాడే పానీయాలలో పాలు ఒకటి. ఇందులో కాల్షియం, విటమిన్లు ఎ, బి12, పొటాషియం, మెగ్నీషియం ఉన్నాయి.

అయితే సాధరణ ఆవు పాలు కంటే మొక్కల ఆధారిత ఈ పాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.

సోయా పాలు గుండెకి మేలు చేస్తాయి. ఇందులో సంతృప్త కొవ్వులు తక్కువ. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

ఇందులో 80 కేలరీలు, పాలిఅన్ శాచురేటెడ్ కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ తో పాటు ఒక కప్పులో కేవలం 2 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది.

ఓట్ మిల్క్ లో విటమిన్ బి ఎక్కువ. ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

బాదం పాలలో పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువ. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బియ్యం నుంచి పాలు తీస్తారనే విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆవు పాలలో ఉన్నంత కాల్షియం బియ్యం పాలలో కూడా ఉంటుంది. నియాసిన్, విటమిన్ బి 6 తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటాయి.

ఒక గ్లాసు రైస్ మిల్క్ లో 113 కేలరీలు ఉంటాయి.
Images Credit: Pixabay/ Pexels/ Unsplash