తయారీ విధానం: ఒక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో గోండు వేసి ఉబ్బినంత వరకు వేయించాలి. గోండుని ఒక ప్లేట్ లోకి తీసి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గసగసాలు ఒక నిమిషం పాటు వేడి చేసుకోవాలి.
గోండు పొడిలో గసగసాలు, తురిమిన కొబ్బరి వేసి కలుపుకోవాలి. మరొక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. మరొక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా, గుమ్మడి గింజలు, ఎండుద్రాక్ష, పొద్దుతిరుగుడు గింజలు వేసి కాసేపు వేయించుకోవాలి. వాటిని ప్లేట్ లోకి తీసుకుని మెత్తగా నలగగొట్టాలి.
ఇంకొక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి సన్నగా తరిగిన అంజీర్, మెత్తని ఖర్జూరాలు వేసుకోవాలి. ఇవి రెండు పేస్ట్ లాగా అయ్యేవరకు వేయించాలి. ఇప్పుడు అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అన్ని పదార్థాలు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా రోల్ చేసుకోవడమే.
ఇందులో నట్స్, గింజలు వేయడం వల్ల పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లను అందిస్తాయి. ఖర్జూరాలు పాల ఉత్పత్తిని పెంచుతాయి.
ఈ లడ్డూ రోజుకోకటి తిన్నా చాలు పోషకాలు తల్లులకు అందుతాయి. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు.