ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా చేయండి

ప్రాచీన కాలం నుంచి అందం పెంచే ఉత్పత్తిగా రోజు వాటర్ వాడుకలో ఉంది. అనేక సౌందర్య ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగిస్తారు.

చర్మాన్ని తేమవంతంగా ఉంచడంలో ఇది ముందుంటుంది. రోజ్ వాటర్‌ని దాదాపు అందరూ మార్కెట్లో కొనే తెచ్చుకుంటారు.

తాజా గులాబీ పూల నుంచి రేకులను విడదీయాలి. చిన్న కుండలో లేదా గిన్నెలో నీళ్లు పోసి గులాబీ రేకులను వేయాలి.

తక్కువ మంట మీద ఆ నీటిని వేడి చేయాలి. నీటి ఆవిరి వచ్చేవరకు ఉంచి, తర్వాత స్టవ్ కట్టేయాలి.

గిన్నెపై మూత పెట్టి 20 నిమిషాలు అలా వదిలేయాలి. వేడి తగ్గాక ఒక చిన్న సీసాలో ఈరోజు వాటర్‌ను వేసి మూత పెట్టి ఫ్రిజ్లో నిల్వ చేయాలి.

దీన్ని వారం రోజుల వరకు వాడుకోవచ్చు. అవసరమైనప్పుడు మళ్ళీ తయారు చేసుకోవాలి.

దీన్ని సహజంగా సేంద్రియ పద్ధతిలోని తయారు చేసాము కాబట్టి, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

గులాబీలు ఎంచుకునేటప్పుడు సేంద్రీయ పద్ధతిలో పెంచినవే అయి ఉండాలి. వాటిపై మందులు స్ప్రే చేసి ఉండకూడదు.