సెంటెడ్ క్యాండిల్స్ ఇంట్లో వెలిగిస్తే ఎన్ని లాభాలో ఆరోగ్యం కోసం కూడా సువాసనలు వీచే కొవ్వొత్తులను వాడమని చెబుతున్నాయి అధ్యయనాలు. సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోవడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. సెంటెడ్ క్యాండిల్ వెలిగించుకుంటే సువాసన శాస్త్రం ప్రకారం జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ప్రోడక్టివిటీ పెరగాలంటే మీ మానసిక స్థితి మెరుగ్గా ఉండాలి. మానసిక ఆందోళన తగ్గాలి. ఈ రెండూ సెంటెడ్ క్యాండిల్స్ చేయగలదు. మీకు ఇంట్లోనే మెడిటేషన్, యోగా వంటివి సాధన చేసే అలవాటు ఉంటే, అవి చేస్తున్నప్పుడు సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోండి. జాస్మిన్, లావెండర్, పెప్పర్మెంట్ వంటి ఆహ్లాదకరమైన వాసనలు వీచే ఈ క్యాండిల్స్ మీలో పాజిటివిటీని పెంచుతాయి. సువాసన కొవ్వొత్తి శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి సెంటెడ్ క్యాండిల్స్ ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి.