ప్రెషర్ కుక్కర్లో సులువుగా మటన్ పులావ్

మటన్ - అరకిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు
పెరుగు - ముప్పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - ఒక స్పూన్
నూనె - రెండు స్పూన్లు

మసాలా దినుసులు - ఒక గుప్పెడు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర - ఒక కట్ట
పుదీనా - ఒక కట్ట
నీళ్లు - సరిపడినన్ని
కారం - ఒక టీ స్పూను
గసగసాలు - ఒక స్పూను

మటన్‌లో పెరుగు, ఉప్పు వేసి గంటపాటూ మారినేట్ చేయాలి.

కళాయి పెట్టి మసాలా దినుసులు, గసగసాలు వేయించి మసాలా పొడి చేసుకోవాలి.

కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ఉల్లితరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

అవి బాగా వేగాక కొత్తిమీర, పుదీనా, కారం, ముందుగా మిక్సీలో చేసుకున్న మసాలా పొడి వేసి బాగా వేయించాలి.

అందులో మటన్ వేసి ఉడికించాలి. కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వరకు ఉడికిస్తే మటన్ మెత్తగా ఉడికిస్తుంది.

ఆ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి.

అవసరమైతే ఒక గ్లాస్ వాటర్ వేయాలి. మళ్ళీ విజిల్ పెట్టి రెండు విజిల్స్ వరకు స్టవ్ మీద ఉంచాలి.

ఆవిరంతా పోయాక మూత తీస్తే మటన్ పులావ్ రెడీ అయినట్టే.

(Image Credit: Pexels/Pixabay/Youtube)