సీతా, రామాఫలాలు తెలుసు కదా,ఇది లక్ష్మణ ఫలం

చాలా తక్కువ మందికి తెలిసిన పండ్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి లక్ష్మణ ఫలం, దీన్నే హనుమాన్ ఫలం అని కూడా పిలుస్తారు.

మెక్సికో, దక్షిణ అమెరికాలో అధికంగా ఈ చెట్లు కనిపిస్తాయి. ఇవి రామాఫలం, సీతాఫలం జాతికి చెందినవే.

ఈ పండును సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన కీమోథెరపీ అని కూడా చాలా చోట్ల పిలుస్తారు.

ఈ పండును, ఈ చెట్టు ఆకులను తీసుకోవడం వల్ల 12 రకాల క్యాన్సర్లను తరిమి కొట్టవచ్చని ఎంతోమంది నమ్మకం.

విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది.

యుటిఐ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఈ పండు తింటే ఎంతో ఆరోగ్యం.

రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి రోగాల నుండి ఈ పండు రక్షిస్తుంది.

ఈ పండు బ్రెజిల్ కి చెందినదిగా చెబుతారు. అక్కడే మొదటగా ఈ చెట్టును కనిపెట్టారని అంటారు.