కొరియన్ సూపర్ ఫుడ్ ‘కిమ్చి’

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ రోగనిరోధక శక్తిని పెంచే కొరియన్ సూపర్ ఫుడ్ కిమ్చి.

కిమ్చి వంటకాన్ని మనం కూడా తినాలి. దానికి కారణం అందులో గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి.

దీన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చేస్తారు. అన్నింటికన్నా ఫేమస్ ‘క్యాబేజీతో చేసే కిమ్చి’. ఇది ఊరగాయలా ఉంటుంది.

కిమ్చిని పులియబట్టి చేస్తారు. కాబట్టి ఇది అద్భుతమైన ప్రోబయోటిక్ ఆహారం అని చెప్పుకోవచ్చు.

పెరుగు, పాల ఉత్పత్తుల్లో ఉండే లాక్టోబాసిల్లి అనే బాక్టీరియా కిమ్చీలో ఉంటుంది.

దీన్ని తినడం వల్ల అలర్జీలు, మంట, మలబద్దకం, విరోచనాలు, గుండెల్లో మంట వంటివి రాకుండా ఉంటాయి.

అధిక బరువు ఉన్నవారు పులియబెట్టిన కిమ్చీని తినడం వల్ల శరీరంలోని కొవ్వు గణనీయంగా తగ్గుతుంది.

గుండెకు కిమ్చి చాలా అవసరం. ఇది అనేక గుండె జబ్బులకు కారణమైన కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.