నానబెట్టిన ఎండు అంజీర్ లో జింక్‌, మాంగనీస్‌, మెగ్నిషియం, ఐర‌న్, కాల్షియం స‌మృద్ధిగా ఉంటాయి. పోషకాహారలోపం తలెత్తదు.

బరువు తగ్గడానికి సహాయపడతాయి. అందుకే ఉదయం నానబెట్టిన అంజీర్ తింటే పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆకలి తగ్గుతుంది.

వీటిలో కరిగే, కరగని ఫైబర్ ఉంటుంది. మలబద్దకం సమస్యని తగ్గిస్తుంది. పేగులను శుభ్రపరుస్తుంది.

ఇందులో ఒమేగా 3, 6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.

ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇందులో కాల్షియం ఉంటుంది. ఎముకలు ధృడంగా మారేందుకు సహాయపడుతుంది.

పీసీఓడీ, పీసీఓఎస్, మెనోపాజ్, రుతుక్రమ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వీటిని తింటే చాలా మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి 6 గర్భంలో పిండం ఎదుగుదలకు దోహదపడతాయి.

రొమ్ము క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.

అంజీరాలో విటమిన్ సి ఉంటుంది. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని అందిస్తుంది. మొటిమల మచ్చలు తొలగిస్తుంది.
Image Credit; Unsplash/ Pexels