గుడ్డు నిజంగా గుండెకు హానికరమా? గుడ్లు అధికంగా తినడం వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది అని చాలామంది అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుందనేది నిజం. అలాగే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. మితంగా సోడియం కూడా ఉంటుంది. అందుకే గుడ్లను పోషకాహారంగా చెబుతారు. దీనిలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుందనేది మాత్రం నిజం కాదు. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి రోజుకో గుడ్డు తింటే సరిపోతుంది అని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఎక్కువ గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. అలా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెకు ప్రమాదం. రోజుకో గుడ్డు తినడం వల్ల మాత్రం గుండెకెలాంటి హాని కలగదు. పైగా ఎంతో మేలు కూడా. ఉడికించిన గుడ్లు తినడం వల్ల పోషకాలు బయటికి పోవు. ఆమ్లెట్లు, ఖీమాలాంటివి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయి.