ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది

కేవలం అధిక బరువుతో ఉన్న వారిలోనే కొలెస్ట్రాల్ ఉంటుందని అనుకుంటాం, కానీ సన్నగా ఉండే వారిలో కూడా చెడు కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంది.

కొలెస్ట్రాల్ కరగడానికి ‘ఉసిరి అర్జున జ్యూస్’ ఎంతో మేలు చేస్తుంది.

ఉసిరికాయను బాగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీలో గుజ్జులా చేసుకోవాలి. ఆ గుజ్జు నుంచి ఉసిరి రసాన్ని తీయాలి.

ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి మరిగించాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడే అర్జున చెట్టు బెరడు ముక్కను కూడా వేసి మరిగించాలి.

కాస్త చల్లారాక వడకట్టుకొని ఒక బాటిల్‌లో ఆ నీటిని పోయాలి. ఆ బాటిల్ నీటిలో ముందుగా తీసుకున్న ఉసిరి రసాన్ని కలుపుకోవాలి.

తాగే ముందు తేనె కలుపుకుని తాగితే అజీర్ణం, ఎసిడిటీ, మలబద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తగ్గుతాయి.

ఈ జ్యూస్ తక్కువ కాలంలోనే మెరిసే చర్మాన్ని ఇస్తుంది. ఇది చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరచి మెరుపును అందిస్తుంది.

ఈ జ్యూస్ వల్ల గుండెకు ఎంతో మంచిది. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ జ్యూస్ రోజూ తాగాలి.