ఆల్కహాల్ అలెర్జీ లక్షణాలు ఇవే ఆల్కహాల్ తాగిన తర్వాత వికారంగా, అసౌకర్యంగా అనిపిస్తే మీకు ఆల్కహాల్ అలెర్జీ ఉందని అర్థం. ఆపకుండా ఆల్కహాల్ అలవాటును కొనసాగిస్తే అది ప్రాణాంతక సమస్యలకు కారణం అవుతుంది. మద్యం తాగాక వికారంగా, అసౌకర్యంగా అనిపిస్తే గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 4 రెట్లు ఎక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతి 12 మంది పెద్దలలో ఒకరికి ఇలా ఆల్కహాల్ అలెర్జీ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఆ విషయం వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. స్థిరంగా మద్యపానం అలవాటును కొనసాగించే వారిలో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా అధికమే. ఆల్కహాల్ తాగితే జ్ఞాపకశక్తిని కోల్పోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీలు దెబ్బతినడం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతాయి. మద్యపానం చాలా హానికరం. ఇంటా, బయటా మద్యపానం వల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయి. ఆల్కహాల్ అలెర్జీ మీకు ఉందనిపిస్తే దాన్ని మానేయడం బెటర్.