కార్న్ ఫ్లాక్స్ తినడం మానేయమంటున్న హార్వర్డ్ పరిశోధన

పాలలో ఈ కార్న్ ఫ్లాక్స్ వేసుకుంటే చాలు బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోతుంది. అందుకే కార్న్ ఫ్లాక్స్ తక్కువ సమయంలోనే ఎక్కువ మంది మనసు దోచుకుంది.

హార్వర్డ్ అధ్యయనంలో కార్న్ ఫ్లాక్స్ తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం లేదని, పైగా ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుందని తేలింది.

కార్న్ ఫ్లాక్స్ తినడం వల్ల మధుమేహం, ఫ్యాటీ లివర్, ఊబకాయం, అధిక రక్తపోటు, శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు పెరిగిపోతాయి.

కార్న్ ఫ్లాక్స్ లో తక్కువ ఫైబర్ ఉండడం వల్ల మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది. దీనివల్ల బరువు పెరిగిపోతారు.

కార్న్ ఫ్లాక్స్ వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరిగిపోతుందని పరిశోధకులు వివరించారు.

డయాబెటిక్ రోగులు కార్న్ ఫ్లాక్స్ ను పూర్తిగా మానేయాలి. వారికి తెలియకుండానే రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగిపోతాయి.

అంతేకాదు కార్న్ ఫ్లాక్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ 93. అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. మధుమేహ రోగులకు కార్న్ ఫ్లాక్స్ పూర్తిగా మంచివి కావు.