సజ్జలను ఎందుకు తినాలి?

చిరుధాన్యాల్లో సజ్జలు కూడా ఒక భాగం. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

సజ్జల్లో ఉండే ఫైటో కెమికల్ రక్తనాళాల్లో కొవ్వును పేరుకుపోనివ్వదు. ఒకవేళ పేరుకుపోయినా కూడా దానిని బయటికి పంపించేందుకు సహకరిస్తుంది.

సజ్జలను తింటే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణం ఉంది.

సజ్జల్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియ సజావుగా సాగేలా చూస్తుంది. శరీరంలో ఎక్కడా కొవ్వు చేరకుండా కాపాడే గుణం సజ్జలకు ఉంది.

సజ్జలను తినడం కష్టం అనుకుంటారు చాలామంది, వీటిని రవ్వగా చేసి ఇంట్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడల్లా వాటితో సంగటి, అన్నం చేసుకొని తినవచ్చు.

ఒక నెలపాటు సజ్జలతో అన్నం వండుకుని తిని చూడండి. ఆరోగ్యంలో మార్పు మీకే కనిపిస్తుంది. చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు.

మధుమేహం బారిన పడిన వాళ్ళు ఆ వ్యాధి లక్షణాలు కనిపించకుండా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి సజ్జలు తినడం ఈరోజు నుంచే ప్రారంభించండి.

గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం, ఊబకాయం వంటివి సజ్జల వల్ల దూరంగా ఉంటాయి.