మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా మధుమేహం అందరీని ఇబ్బంది పెడుతుంది.

మనం చేసే చిన్న చిన్న పనులే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని మరింతగా పెంచేస్తాయి.

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బరువు పెరుగుతారు, కొవ్వు పేరుకుపోతుంది. దీర్ఘకాలంలో టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదముంది

శరీరానికి తగినంత సూర్యరశ్మి తగలకపోవడం చాలా హానికరం. విటమిన్ డి లోపంతో పాటు మధుమేహం వచ్చే ప్రమాదానికి దారితీస్తుంది.

శారీరక శ్రమ లేకపోతే కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

కాఫీలోని కెఫీన్ వల్ల నిద్రలేమి మాత్రమే కాదు దీర్ఘకాలంలో మధుమేహం సమస్యని తీసుకొస్తుంది.

గురకని తేలికగా తీసుకోవద్దు. దీర్ఘకాలంలో ఇది స్లీప్ అప్నియా, స్థూలకాయం, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు తీసుకొస్తుంది.

నిద్రలేమి మధుమేహానికి ప్రధాన కారణం. రోజుకి కనీసం ఏడు లేదా ఎనిమిది గంటలు నిద్ర అవసరం.

పీసీఓఎస్, వంశపారపర్యంగా కూడా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదానికి కారణాలు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Images Credit: Pexels