ఇంట్లోనే డ్రైఫ్రూట్స్ తయారీ ఇలా

డ్రై ఫ్రూట్స్ చాలా ఖరీదైనవి. వాటిని ఇంట్లోనే మీరు సులువుగా తయారు చేసుకోవచ్చు.

ఏ పండ్లను డ్రై ఫ్రూట్స్‌గా మార్చాలి అనుకుంటున్నారో వాటిని నీళ్లలో అయిదు నిమిషాలు నానబెట్టి, ముక్కలుగా కోసుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి నిమ్మరసం కలపాలి. ఈ పండ్ల ముక్కలను ఆ నీళ్లలో వేసి ఐదు నిమిషాలు నానబెట్టి బయట పెట్టాలి.

బేకింగ్ ట్రేను తీసుకొని దాని అడుగున పార్సుమెంట్ పేపర్ వేసి పండ్ల ముక్కలను ఒక దానికి ఒకటి తాకకుండా పరుచుకోవాలి.

మైక్రోఓవెన్‌ను ముందుగానే 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రీ హీట్ చేసుకోవాలి.

ఈ పండ్ల ముక్కలు పరిచిన ట్రేను ఓవెన్లో 25 నిమిషాల పాటు ఉంచాలి. 180 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేటట్టు చూసుకోవాలి.

ఓవెన్లో పండ్ల ముక్కలు డీహైడ్రేట్ అవుతాయి. అంటే ఆ పండ్ల ముక్కల్లోని తేమ మొత్తం బయటికి పోయి ఎండిపోతాయి.

ఆ తర్వాత వాటిని బయటకు తీసి చల్లారనివ్వాలి. ఆపై గాలి చొరబడని గాజు సీసాలో వేసి వీటిని నిల్వ చేయవచ్చు.