దానిమ్మతో అందం రెట్టింపు

దానిమ్మ తినడం వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. నిగనిగలాడుతుంది.

అందుకే రోజుకో కప్పు దానిమ్మ గింజలు తినడం అలవాటు చేసుకోండి. రెండు వారాల్లో చర్మంలో ఆ మెరుపు కనిపిస్తుంది.

రక్తహీనత సమస్య ఉన్న వారు కూడా దానిమ్మను తినడం వల్ల ఆ సమస్య దూరం అవుతుంది.

ఈ పండులో విటమిన్లు, పీచు, క్యాన్సర్ నిరోధకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

ఇవన్నీ చర్మంపై ముడతలు, గీతలు రాకుండా అడ్డుకుంటాయి. ముసలితనం త్వరగా రానివ్వవు.

దానిమ్మ గింజల్లో ఉండే నూనె మన చర్మంపై ఉన్న ఎపిడెర్మిస్‌ను బలంగా మారుతుంది. దీని వల్ల ముడతలు పడవు.

రక్తపోటు, కీళ్ల నొప్పుల సమస్యలు రోజూ దానిమ్మ గింజలు తినడం వల్ల త్వరగా రావు.

దానిమ్మ అందరికీ అందుబాటులోనే ధరలోనే ఉంటుంది. కాబట్టి వాటిని రోజూ తినడం అలవాటు చేసుకోవాలి.