ఈ రోజు(ఫిబ్రవరి-13) కిస్ డే. ముద్దు ప్రేమను వ్యక్తం చేయడానికే కాదు, ఆరోగ్యానికీ మంచిదే. ముద్దు రక్తనాళాలను విస్తరించడానికి హెల్ప్ చేస్తుంది. రక్తపోటు తగ్గిస్తుంది. ముద్దు వల్ల తలనొప్పి నుంచి ఉశమనం లభిస్తుంది. ముద్దు వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. అది దంతాలను శుభ్రం చేస్తుంది. కానీ, మీ పార్టనర్‌కు ఎలాంటి చెడు అలవాట్లు లేకపోతేనే మీ ‘ముద్దు’కు వాల్యూ ఉంటుంది. ముద్దు వల్ల విడుదలయ్యే సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఒక గాఢమైన ముద్దు 8-16 క్యాలరీలను బర్న్ చేస్తుంది. నిత్యం ముద్దుపెట్టుకుంటే మీ మెడ, దవడలకు మంచి షేప్ వస్తుంది. ముద్దు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సగటు వ్యక్తి తన జీవితంలో 20 వేల నిమిషాల కంటే ఎక్కువ సమయం ముద్దు పెట్టుకోవడానికి గడుపుతాడట. Images Credit: Pixabay and Pexels