ఈవినింగ్ 6 తర్వాత చీజ్ తీసుకోకూడదు. ఇందులో సోడియం ఉంటుంది, శరీరం దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. రెడ్ మీట్ రాత్రి భోజనంగా తింటే గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఇందులో సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్నాయి. మైక్రోవేవ్ లో చేసిన పాప్ కార్న్ లో ప్రిజర్వేటివ్స్, సోడియం, ఇతర టాక్సిక్ కాంపొనెంట్ లు ఎక్కువగా ఉంటాయి. కెచప్ లో చక్కెర, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అధికంగా ఉంటుంది. ఇది రాత్రి సమయంలో జీవక్రియకి ఇబ్బంది తెచ్చిపెడుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడూ మంచిది కాదు. ఇందులో సోడియం, కొవ్వులు, పిండి పదార్థాలు ఉంటాయి. సాయంత్రం 6 తర్వాత అసలు తీసుకోవద్దు. తియ్యగా నోరూరించే ఐస్ క్రీమ్ రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. డ్రింక్స్ తీసుకుంటే అందులోని చక్కెర జీవక్రియని దెబ్బతీస్తుంది. రక్తంలో పేరుకుపోయి అధిక బరువుకి దారితీస్తుంది. ఫ్రొజెన్ ఫుడ్ ఎప్పుడు మంచిది కాదు. ఇందులో చక్కెర అధికంగా ఉండి స్థూలకాయానికి దారితీస్తుంది. షుగర్ లెవల్స్ పెంచుతాయి. Image Credit: Pexels