డయాబెటిస్ అదుపులో ఉండాలా? ముల్లంగి తినండి దుంప జాతికి చెందిన కూరగాయల్లో ముల్లంగి ఒకటి. దీని వాసన పచ్చిగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇష్టపడరు. దీనిలో ఫోలిక్ యాసిడ్, పొటాషియం, జింక్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటివి అధికంగా ఉన్నాయి. మధుమేహంతో బాధపడేవారు ముల్లంగిని తినడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ముల్లంగిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే లక్షణం ఉంది. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వారానికి కనీసం మూడు సార్లు ముల్లంగితో వండిన ఆహారం మధుమేహులు తినడం చాలా మంచిది. వారానికి రెండు సార్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రాణాంతక అనారోగ్యాలైన క్యాన్సర్ వంటివి దూరంగానే ఉంటాయి. ముల్లంగి త్వరగా జీర్ణం అవుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. ఆస్టియోపొరోసిస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.