బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దాన్ని తినే ముందు అందులోని విత్తనాలు తీసిపారేస్తాం. కానీ వాటి వల్ల ఎన్నో లాభాలున్నాయ్.

బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. ఈ విత్తనాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీవక్రియని నియంత్రిస్తాయి.

ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్స్, పాలీఫెనాల్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో వాపుని తగ్గిస్తాయి.

ఈ విత్తనాల్లో ఉండే ఫైబర్, కొన్ని కొవ్వు ఆమ్లాలు శరీరంలోని కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయడతాయి.

వీటిలో కార్పైన్ ఉంటుంది. పేగుల్లోని హానికర బ్యాక్టీరియాని చంపేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ విత్తనాలు పచ్చిగా తినొచ్చు లేదంటే పొడి చేసుకుని షేక్స్ లేదా స్మూతిస్ లో వేసుకోవచ్చు.

నారింజ పండు కంటె ఎక్కువ విటమిన్-సిని కలిగి బొప్పాయి పండులోనే ఉంటుంది.

బొప్పాయి పండు కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య, అసిడిటీ, లివర్ శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను బయటికి పంపడం వంటి సమస్యలతో పోరాడుతుంది.