చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి.

అందుకే చాక్లెట్ తో ఫేస్ మాస్క్ వేసుకుంటే మెరిసే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

బయట నుంచి కొనుగోలు చేసే ఖరీదైన మాస్క్ కి బదులుగా ఇంట్లోని దీన్ని సులభంగా తయారుచేసుకోవచ్చు.

1/4 కప్పు డార్క్ చాక్లెట్, 2 టేబుల్ స్పూన్ల క్రీమ్, కొద్దిగా తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం ఉంటే చాలు ఫేస్ మాస్క్ ఈజీగా చేసుకోవచ్చు.

అన్ని పదార్థాలు బాగా కలుపుకుని ముఖానికి రాసుకోవడమే. క్రమం తప్పకుండా ఇది రాసుకుంటే మెరిసే చర్మాన్ని పొందుతారు.

చాక్లెట్ అందాన్ని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోజూ తినే చిన్న చాక్లెట్ ముక్క మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది.

డార్క్ చాకొలెట్ తినడం వల్ల మెదడులో ఉండే డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదలవుతుంది.

ఈ చాక్లెట్లలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు రోజూ చాక్లెట్ ముక్కను తినొచ్చు.
Images Credit: Pexel