ఇలా పాలు తాగితే అధిక రక్తపోటు అదుపులో ప్రపంచంలో అధిక శాతం మంది హైపర్ టెన్షన్ లేదా హైబీపీతో బాధపడుతున్నట్టు అంచనా. తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, దగ్గు వంటివి బీపీ పెరిగితే కనిపించే లక్షణాలు. ఆయుర్వేదం ప్రకారం అధిక రక్తపోటు వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలలో అసమతుల్యత వల్ల వస్తుంది. శరీరంలో టాక్సిన్స్ చేరడం, చెడు జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, జీవక్రియ సరిగా జరగకపోవడం వంటివి హైబీపీకి కారణాలు. ఆయుర్వేదంలో అర్జున బెరడుకు చాలా ప్రాధాన్యత. ఈ బెరడు పొడి మార్కెట్లో దొరుకుతుంది. కప్పు పాలలో ఈ అర్జున పొడిని వేసి బాగా కలపాలి. రోజుకు రెండుసార్లు ఈ పాలను తాగడం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది. అలాగే తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.