కందిపప్పును ఇలా వండి తింటే ఎంత ఆరోగ్యమో

మాంసాహారులు చికెన్, గుడ్ల నుంచి ప్రోటీన్‌ను పొందుతారు. శాకాహారులు మాత్రం ప్రోటీన్ కోసం కందిపప్పు పై ఆధారపడతారు.

శరీరానికి సరిపడా ప్రోటీన్ అందాలంటే, ఎలా పడితే అలా పప్పును తింటే ఉపయోగం ఉండదు.

చాలా మంది నాలుగు భాగాల నీరు, ఒక భాగం పప్పు వేసి నీళ్లలాగా వండుతారు. ఇలా నీళ్లపప్పుని తింటే ఉపయోగం ఉండదు.

వ్యక్తికి ఒక రోజులో అవసరమైన ప్రోటీన్ అతని బరువుపై ఆధారపడి ఉంటుంది. ఒక కిలో బరువుకు 0.8 గ్రా అవసరం.

100 గ్రాముల పప్పులో 16 గ్రాముల ఫైబర్, 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

నలుగురున్న ఇంట్లో రోజుకు 100 గ్రాముల పప్పును వండినట్లయితే, ఒకరికి కేవలం 2 నుంచి 3 గ్రాములు మాత్రమే వస్తుంది.

కందిపప్పును నీళ్లలా వండకుండా కూరలా కాస్త గట్టిగా వండుకుని తింటే మంచిది.

శరీరానికి అవసరమైన ప్రొటీన్ అందే అవకాశం ఉంది.