ఈ టీ తాగితే థైరాయిడ్ దూరం

గొంతు దగ్గర చిన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంధి థైరాయిడ్. ఇది థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

ఈ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయినా సమస్యే, తక్కువగా ఉత్పత్తి అయిన సమస్యే.

మహిళలు అధికంగా ఎదుర్కొంటున్న సమస్య థైరాయిడ్ . దీనికి ఓ మసాలా టీతో చెక్ పెట్టొచ్చు.

థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు రోజు ఈ టీని తాగితే కొన్ని వారాల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చేస్తుంది.

రోజూ పరగడుపున ధనియాలతో ఈ టీని తయారుచేసుకోవాలి.

ఈ టీ ని చేయడం చాలా సులువు. రోజూ రెండుసార్లు తాగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకొని ఒక స్పూను ధనియాలను వేసి రాత్రంతా నానబెట్టాలి.

ఉదయం లేచాక ఆ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి మరగబెట్టాలి. వడకట్టి, కాస్త తేనె కలుపుకొని తాగాలి.