లిప్ స్టిక్ వేసుకోకుండానే గులాబీ రంగులో పెదవులు మృదువుగా మెరిసిపోతూ కనిపించాలంటే ఈ చిట్కాలు ట్రై చేయండి. తేనె, చక్కెరతో ఎక్స్ ఫోలియేట్ టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ లేదా వైట్ షుగర్ తీసుకోవాలి. వాటిని బాగా కలిపి పెదాలకు స్క్రబ్ చేసుకోవాలి. అర టీ స్పూన్ పాలు, కొద్దిగా పసుపు వేసుకుని పేస్ట్ లా కలుపుకుని పెదాలకు రాసుకోవాలి. పాలు, పసుపు కలిసి పెదవులు పాలిపోకుండా చేస్తాయి. సహజంగా పింక్ పెదాలను ఇస్తాయి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు బొడ్డు దగ్గర వెచ్చని నెయ్యితో మసాజ్ చేసుకోవాలి. ఇది పెదాలను అంతర్గతంగా రిపేర్ చేస్తుంది. అలోవెరా జెల్ లో కొబ్బరి లేదా ఆలివ్ నూనె రెండు చుక్కలు వేసుకుని ఆ మిశ్రమాన్ని పెదాలకు రాసుకోవచ్చు. బీట్ రూట్ సహజంగానే ఎర్రగా ఉండటం వల్ల ఎక్స్ ఫోలియంట్ గా పని చేస్తుంది. దీనితో మసాజ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. రాత్రిపూట 5-6 గులాబీ రేకులు అరకప్పు పాలలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ పూల రేకులు పేస్ట్ పెదాలకు రాసుకోవాలి. మసూర్ పప్పు, ఆవాల నూనె రెండు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. టాన్ పోయి పెదాలు నల్లగా లేకుండా ఉంటాయి. Images Credit: Pixabay/ Pexels