మొహం మీద ఉండే వెంట్రుకలు తొలగించుకునేందుకు చాలా మంది బ్యూటీపార్లర్ కి వెళ్ళి త్రెడ్డింగ్ చేయించుకుంటారు.

అంతగా ఇబ్బంది పడకుండా సింపుల్ ఇంట్లో దొరికె వాటితోనే ఫేషియల్ చేసుకుని మొహం మీద ఉన్న వెంట్రుకలు తొలగించుకోవచ్చు.

పుదీనా టీ ముఖంపై వెంట్రుకలు వదిలించుకోవడానికి సహాయపడుతుంది. రక్తంలో టెస్టోస్టెరాన్ తగ్గిస్తుంది.

బొప్పాయి ముక్కలు పేస్ట్ లా చేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకుని రాసుకుంటే అవాంఛిత రోమాలు పెరగకుండా అడ్డుకుంటుంది.

పాలు, జెలటిన్, కొద్దిగా నిమ్మరసం వేసి 15 సెకన్ల పాటు మైక్రోవేవ్ లో ఉంచాలి. దీని మొహంపై రాసుకుని ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

శనగపిండి, రోజ్ వాటర్ కలిపి రాసుకుంటే ఎక్స్ ఫోలియెంట్ గా పని చేస్తుంది. వెంట్రుకల పెరుగుదల ఆపుతుంది.

కొద్దిగా పంచదార, నిమ్మరసం, తేనె, కార్న్ ఫ్లోర్ కలుపుకుని ముఖానికి రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకలు తొలగిపోతాయి.

బంగాళాదుంప, ఉడికించిన పప్పుతో కలిపి పేస్ట్ లా రాసుకుని 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. బంగాళాదుంప బ్లీచింగ్ గా ఉపయోగపడుతుంది.

ఓట్స్, పండిన అరటిపండు కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి రాసుకుని స్క్రబ్ చేయాలి. చర్మం మృదువుగా ఉండేలా చేస్తాయి.

ఇలా చేశారంటే మొహం మీద ఉన్న అవాంఛిత రోమాలు పోగొట్టుకోవచ్చు.
Images Credit: Pexels