భార్యాభర్తల విడాకులకు ముఖ్యకారణాలు ఇవే మీ వివాహాన్ని నాశనం చేసే కొన్ని కారణాలు ఇవే. వీటిని అధిగమించేందుకు ముందే సిద్ధమైతే మీ వివాహ బంధం వందేళ్లు నిండుగా సాగుతుంది. భార్యాభర్తలు విడిపోవడానికి ముఖ్యంగా దోహదం చేసే కారణాలు ఇవే. భార్యాభర్తల కమ్యూనికేషన్ లోపం ఉండడం. మీతో జీవితాంతం నడిచే వ్యక్తిని ఏ చిన్న విషయంలో మోసం చేసినా, అది చాలా పెద్ద ఫలితాన్ని అందిస్తుంది. డబ్బు సమస్యలు కూడా ఇంట్లో భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. లైంగిక సంబంధం కూడా బంధాన్ని పట్టి ఉంచడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. అది లేకపోతే ఆ బంధం బీటలు వారుతుంది. ఒకరినొకరు విమర్శించుకోవడం, నిందలు వేయడం అనేది భార్యాభర్తల విషయంలో చాలా ప్రమాదం. మీ జీవిత భాగస్వామిపై అపనమ్మకం చాలా ప్రమాదం. ఒకరినొకరు పూర్తిగా నమ్మితేనే బంధం కొనసాగుతుంది.