ఆపిల్ పండ్లు ఎప్పుడు తినకూడదో తెలుసా?

ఆపిల్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లాంటి ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

అందుకే రోజుకో ఆపిల్ పండు తింటే చాలు, వైద్యుడి అవసరం ఉండదు అంటారు.

ఈ పండును సంపూర్ణ పోషణను ఇచ్చే ఆహారంగా చెప్పవచ్చు. అయితే ఈ పండు తినకూడని సమయం ఉంది.

రోజులో ఎప్పుడైనా ఆపిల్ తినవచ్చు కానీ రాత్రి మాత్రం వద్దని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

ఈ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని రాత్రి తింటే త్వరగా జీర్ణం కాదు.

జీర్ణ వ్యవస్థ విధులకు ఆటంకం కలుగుతుంది. ఆపిల్‌తో పాటు రాత్రి తిన్న ఇతర ఆహారాలు కూడా సరిగా జీర్ణం కావు.

కాబట్టి రాత్రి ఆపిల్ తినే అలవాటును వదిలేయాలి. మిగతా సమయాల్లో ఎప్పుడైనా తినవచ్చు.

ఆపిల్ రాత్రిపూట తినడం వల్ల కలిగే చిన్న ఇబ్బంది అదే, కానీ కొందరిలో ఆ చిన్న ఇబ్బంది, పెద్ద సమస్యగా మారుతుంది.

అందుకే పోషకాహార నిపుణులు రాత్రిపూట యాపిల్ తినడం మానేయమని సూచిస్తున్నారు.