ఎండుద్రాక్షతో ఆ సమస్య దూరం రక్తహీనతతో పిల్లలు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఎండుద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. రోజుకు గుప్పెడు ఎండుద్రాక్షలను తినడం వల్ల రక్త హీనత సమస్య దూరం అవుతుంది. ఎండుద్రాక్షలో ఇనుము నిండుగా ఉంటుంది.కాబట్టి రక్త ఉత్పత్తి పుష్కలంగా ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, క్యాల్షియం ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఎండుద్రాక్షలో పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. మహిళల్లో నెలసరి వచ్చే సమయంలో నొప్పిని ఇవి తగ్గిస్తాయి. కాబట్టి రోజూ వీటిని స్త్రీలు తినాలి. శరీరంలో రక్త నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఎండు ద్రాక్ష కాపాడుతుంది.