గర్భిణీలు ప్రసవించే వరకు ఎటువంటి ఆహారం తీసుకోవాలనే దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పుడతారు.

గర్భం దాల్చిన తర్వాత ఈ ఆహారాలు అసలు తీసుకోకూడదు. తింటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది.

పచ్చిగుడ్లు లేదా మయోనైస్ లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది గర్భస్రావానికి కారణమవుతుంది.

జంతువుల కాలేయంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. కానీ ఇది టాక్సిన్స్ తో నిండి ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలు తీసుకోకపోవడమే మంచిది

పచ్చి బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుంది. కానీ సెకండ్ ట్రైమిస్టర్ లో పండిన బొప్పాయి తింటే ఆరోగ్యానికి మంచిది

కాఫీ శిశువుకి హాని చేస్తుంది. ఇందులోని కెఫీన్ కంటెంట్ కారణంగా గర్భస్రావం లేదా తక్కువ బరువుతో పుట్టడం జరుగుతుంది.

పొరపాటున కూడా పచ్చిపాలు తీసుకోవద్దు. అది కాబోయే తల్లులకు విషంతో సమానం. కాచిన పాలు మాత్రమే తీసుకోవాలి

నువ్వుల గింజలు తేనెతో కలిపి తీసుకుంటే గర్భధారణ సమయంలో ఇబ్బందులు వస్తాయి. ఒక్కోసారి గర్భస్రావం అవుతుంది.

పైనాపిల్ లో బ్రోమెలైన్ గర్భాశయ ముఖద్వారాన్ని మృదువుగా చేస్తుంది. దీని వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ