ప్రతిరోజు కొన్ని బాదంపప్పు తింటే శరీరానికి సరైన పోషణ అందుతుంది. శక్తిని ఇవ్వడంతో పాటు మెదడుకి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

కానీ మీరు ఎప్పుడైనా చేదు బాదంపప్పులు తిన్నారా? ఇవి ఘాటైన రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి అసలు మంచిది కాదు

బాదం పప్పుల్లో చేదువి కూడా ఉంటాయి. సాధారణ వాటి మాదిరిగానే ఇవి కూడా వాటిని పోలి ఉంటాయి. అందుకే వాటిని గుర్తించడం కష్టం.

తిన్న తర్వాత మాత్రమే రుచిని బట్టి తెలుసుకోగలుగుతారు. మామూలు బాదం మాదిరిగానే వాటిలోని పోషకాలు ఉంటాయి.

చేదు బాదంలో కొద్ది మొత్తంలో అమిగ్డాలిన్ ఉంటుంది. ఇది శరీరం తీసుకున్నప్పుడు సైనెడ్ గా మారిపోతుంది.

అందుకే చేదు బాదం తీసుకోవడం విషపూరితం అవుతుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు.

ఒక వేళ మీరు బాదం తినేటప్పుడు చేదు తగిలితే వాటిని మింగకుండా బయటకి ఉమ్మివేయడం మంచిది.

చేదు బాదం తీసుకోవడం వల్ల శరీరంలో సైనైడ్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా వికారం, వాంతులు, తల తిరగడం, తలనొప్పి ఎదుర్కోవాల్సి వస్తుంది.

చేదు బాదంలో వివిధ పరిమాణంలో ఉంటుందని వాటిని తీసుకోవడం నిజంగా హానికరమని ఒక అధ్యయనం చెప్పుకొచ్చింది.