పియర్స్ పండు డయాబెటిస్ కి ఉత్తమమైనది. విటమిన్ సి, ఏ ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గ్రీక్ పెరుగు అంటే కాస్త క్రీమీగా ఉంటుంది. పండ్లు కలుపుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పోషకాలు పుష్కలం. డయాబెటిస్ రోగులు భయం లేకుండా యాపిల్ తినొచ్చు. డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్స్ రక్తంలో చక్కెరని తగ్గించడంలో సహాయపడతాయి. గడ్డకట్టిన పండ్లు మధుమేహం ఉన్న వాళ్ళు డెజర్ట్ లో కలుపుకుని తీసుకోవచ్చు. తృణధాన్యాల పిండితో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. అన్నీ నట్స్, గింజలు మిక్స్ చేసుకుని రోజుకు కొన్ని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. బెర్రీలు స్వీట్స్ కి చక్కని ప్రత్యామ్నాయాలు వోట్స్, కొబ్బరి, పీనట్ బటర్, అవిసె గింజలతో చేసిన లడ్డూలు మధుమేహులు ఏ భయం లేకుండా తినొచ్చు. నానబెట్టిన చియా విత్తనాల్లో పండ్లు ముక్కలు వేసుకుని తీసుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.