అరటిపండులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, చక్కెర, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి.

జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పేగు కదలికలని నియంత్రిస్తుంది.

ఎన్నో పోషక గుణాలు కలిగిన అరటి పండు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో అతిగా తింటే మాత్రం అంతే అనారోగ్యాన్ని ఇస్తుంది.

అరటిపండులో దాదాపు 100 కేలరీలు ఉంటాయి. రోజు రెండు అరటిపండ్లకి మించి తింటే బరువు వేగంగా పెరుగుతారు.

పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన దానికి మించి పొటాషియం తీసుకుంటే మైకం, వాంతులు, పల్స్ రేటు పెరుగుతుంది.

అరటిపండ్లు అతిగా తినడం వల్ల దంతాల్లో పుచ్చు ఏర్పడుతుంది. ఇందులో స్టార్చ్ ఉంటుంది. ఇది దంతాల మధ్య సులభంగా అంటుకుంటుంది.

ఇందులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. దీన్ని అధిక మోతాదులో తీసుకుంటే నరాలు దెబ్బతింటాయి.

పచ్చి అరటిపండ్లలో స్టార్చ్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. రోజూ తీసుకుంటే గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే పొటాషియం అధికంగా ఆహారాన్ని తీసుకోవద్దని సలహా ఇస్తారు. అటువంటి వాళ్ళు అరటిపండుని దూరం పెట్టాలి.

రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే మధుమేహం ఉన్న వాళ్ళు వీటిని వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.

కానీ రోజూ అరటిపండు తింటే మంచిదే. పెద్దది కాకుండా మీడియం సైజుది తీసుకోవాలి.
Image Credit: Pexels