గోరువెచ్చని నీటిలో రోజ్ వాటర్, కొన్ని గులాబీ రేకులుకొద్దిగా పాలు వేసుకుని 15-20 నిమిషాల పాటు పాదాలు నానబెట్టుకోవాలి.

శనగపిండి, చిటికెడు పసుపు, కొంచెం రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. దాన్ని పాదాలకు మసాజ్ చేసుకుంటే మురికి వదులుతుంది.

ఒక టీ స్పూన్ కాఫీ పొడి, షుగర్, కొబ్బరి నూనె తీసుకుని బాగా కలిపి పాదాలకు స్ర్కబ్ చేసుకోవాలి.

నిద్రపోయే ముందు నెయ్యితో కనీసం 10 నిమిషాల పాటు సిన్నితంగా మసాజ్ చేసుకోవాలి. కాళ్ళపై ఉన్న ట్యాన్ తొలగిపోతుంది.

చింతపండు గుజ్జులో ఉప్పు కలిపి పాదాలపై 5-6 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి.

నిమ్మతొక్కలు ఎండబెట్టి పొడి చేసుకుని అందులో కాస్త రాళ్ళ ఉప్పు, కొబ్బరి నూనె వేసి పాదాలు, కాళ్ళపై మసాజ్ చేసుకోవాలి

బాగా పండిన బొప్పాయి గుజ్జులో కొద్దిగా కొబ్బరినూనె వేసి కాళ్ళకి రాసి మసాజ్ చేయాలి. ఇలా చేస్తే పాదాలు మృదువుగా ఉంటాయి.

బాగా పండిన అరటిపండులో కొద్దిగా తేనె, ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ లా చేసుకుని పాదాలకు అప్లై చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేశారంటే మీ పాదాల మీద పేరుకుపోయిన మురికి వదిలించుకోవచ్చు.
Image Credit: Pixabay/ Pexels