కొవ్వును కరిగించడంలో ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ పండు ఒకటి ఉందట. అది మరేదో కాదు.. బొప్పాయి పండు. బరువు తగ్గించి కొవ్వుని కరిగించుకునేందుకు ఇది బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉపయోగపడుతుందట. 100 గ్రాముల బొప్పాయిలో 59 కేలరీలు మాత్రమే ఉంటాయి. కార్బోహైడ్రేట్లు 15 గ్రాములు, ఫైబర్ 3 గ్రాములు ఉంటాయి. ఇందులో విటమిన్లు ఏ, సి, బి9(ఫోలేట్), పొటాషియం లభిస్తాయి. జీర్ణక్రియ, ప్రోటీన్ శోషణలో సహాయపడుతుంది. కండరాలను నిర్మించి అరిగిపోయిన కణాలు, కణజాలాలను మరమ్మత్తు చేస్తుంది. డెంగ్యూ రోగులకు బొప్పాయి అద్భు తమైన పండు. బరువు తగ్గాలి అనుకొనేవారికి ఇదే బెస్ట్ పండు. ఇందులోని ఫైబర్, తక్కువ కెలరీల కారణంగా పొట్ట నిండిన అనుభూతిని కలుగుతుంది. బొప్పాయిలో ఫైబర్, నీటి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. నారింజ కంటే ఎక్కువ విటమిన్-సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉన్నాయి. విటమిన్లు ఏ, సి ఉండటం వల్ల చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి. బొప్పాయిలో కొలిన్ ఉంది. అది కొవ్వుని గ్రహించి, శరీరంలోని మంటను తగ్గిస్తుంది.